Akp: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోందని బీఎస్పీ అనకాపల్లి జిల్లా ఇన్ ఛార్జ్ సూదికొండ మాణిక్యాలరావు గురువారం విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణలో విఫలమైందని, ఎన్నికల తర్వాత ధరలు పెంచి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.