SRD: ZPHS ఉన్నత పాఠశాల పటాన్చెరు సమస్యలపై పోరాట సమితి సభ్యులు గురువారం MRO, MDO కార్యాలయంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్, ప్రహరీ గోడ, గేటు నిర్మించాలని కోరారు. స్కూల్ స్థలంలో ఉన్న గుడిసెలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల స్థల వివాదంపై కోర్టులో నడుస్తున్న కేసు విషయాన్ని కూడా చర్చించారు.