SDPT: బెజ్జంకి మండల రైతులకు జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట ఎరువులను సబ్సిడీపై అందిస్తున్నామని వ్యవసాయ అధికారి సంతోష్ తెలిపారు. వీటి వినియోగంతో నేల సారవంతం పెరిగి నైట్రోజన్ స్థాయులు మెరుగుపడతాయని చెప్పారు. మట్టి మెత్తబడడంతో పాటు సూక్ష్మజీవుల పెరుగుదల ద్వారా పంట దిగుబడులు అధికమవుతాయని, రసాయన ఎరువుల అవసరం తగ్గి రైతులకు సాగు ఖర్చు తగ్గుతుందన్నారు.