KNR: శంకరపట్నం మండలంలోని తాడికల్, మెట్పల్లి క్లస్టర్ల రైతులకు పచ్చిరొట్ట (జీలుగు) విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వం 30 కేజీల బస్తాను 50 శాతం సబ్సిడీపై అందిస్తోందన్నారు. రైతులు పట్టాదారు పాసుబుక్, ఆధార్ జిరాక్స్‌లతో ఏఈవోలను సంప్రదించాలని సూచించారు.