TG: రాష్ట్ర యువత నైపుణ్యం పెంచుకుంటే ఉద్యోగ భద్రత ఉంటుందని సీఎం రేవంత్ సూచించారు. గతంలో గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఏజెంట్ల చేతిలో మోసపోయేవారని.. ఇప్పుడు ప్రభుత్వమే గల్ఫ్ వెళ్లే వారి కోసం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. త్వరలో గల్ఫ్ కార్మికుల కోసం మంచి పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు. చైనా, జపాన్, సౌత్ కొరియా పరిశ్రమలకు రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయంగా మారాలన్నారు.