HNK: పరకాల మున్సిపల్ పరిధిలోని 12వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండి నర్సయ్య గౌడ్ బుధవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మడికొండ సంపత్ కుమార్ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్దివ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.