దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మైథాలజీ సబ్జెక్ట్‌తో మూవీ చేయడం తన కల అని, దీనికోసం చాలా ఏళ్లుగా కథను సిద్ధం చేస్తున్నానని తెలిపాడు. ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయ్యాక ఈ మూవీ ఉంటుందన్నాడు. ‘KGF’, ‘సలార్’ వంటి ఊరమాస్ మూవీలు తీసిన నీల్ నుంచి మైథాలజీ సినిమా అంటే ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్నంటాయి.