RR: సైబర్ నేరాలు, మహిళలు, బాలల భద్రతపై వనస్థలిపురం ‘షీ టీమ్’ (She Team) ఆధ్వర్యంలో ఓ షాపింగ్ మాల్లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. లోన్ యాప్ మోసాలు, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాల నిరోధం, గుడ్ అండ్ బ్యాడ్ టచ్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో 112 లేదా 8712662111 నంబర్లను సంప్రదించాలని పోలీసులు సూచించారు.