KRNL: వెడ్డింగ్ కార్డ్స్, శుభలేఖల పేరుతో APK ఫైల్స్ పంపి సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. తెలియని లింకులు, “apk” ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. ఇలాంటి ఫైల్స్ ద్వారా ఫోన్‌పై నియంత్రణ సాధించి బ్యాంకు ఖాతాల నుంచి నగదు కాజేస్తున్నారని తెలిపారు. మోసాలకు గురైతే వెంటనే 1930ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.