TG: మేడ్చల్ జిల్లా మచ్చ బొల్లారంలో అత్యంత నీచమైన ఘటన వెలుగుచూసింది. తల్లితో సహజీవనం చేస్తున్న దుర్గాప్రసాద్ (34) అనే వ్యక్తి, ఆమె 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో అల్వాల్ పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, దర్యాప్తు అనంతరం అతడిని రిమాండ్కు తరలించారు.