NLG: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ విద్యార్థుల పరీక్షల ఫీజు గడువు పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు నల్గొండ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. ఇదే చివరి తేదీ అని పేర్కొన్నారు. విద్యార్థులు నిర్ణీత గడువు లోపు పరీక్ష ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.