AP: టీడీపీ నేత జయచంద్రారెడ్డి కల్తీ మద్యం తయారు చేశారని, ఆ దందాను బయటపెట్టినందుకే జోగి రమేష్‌పై అక్రమ కేసులు పెట్టారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడులు చేయడం చంద్రబాబు కుట్రల్లో భాగమేనన్నారు. ప్రతి ఐదు మద్యం సీసాలలో ఒకటి కల్తీదేనని, ఈ దాడులు, కేసులు రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని జగన్ విమర్శించారు.