HYD: గచ్చిబౌలిలో రూ. 20 కోట్ల విలువైన భూమి వివాదం కలకలం రేపింది. నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో భూ యజమానుల వాటాను అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు రావడంతో సైబరాబాద్ EOW పోలీసులు కేసు నమోదు చేశారు. కన్స్ట్రక్షన్ రియాలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బాలకృష్ణారావుపై బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.