BHNG: యాదాద్రి దేవస్థాన వేద పండితులు వేణుగోపాల చార్యులు మృతి పట్ల ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి సంతాపం తెలియజేశారు. వారి నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. ఆమెతో పాటు మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి ఉన్నారు.