NGKL: దేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రజలకు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కొనియాడారు. గురువారం అచ్చంపేట పట్టణంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశం గర్వించదగ్గ నేతగా ఈ దేశ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని ఆయన అన్నారు.