WGL: నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA దొంతి మాధవరెడ్డి హాజరై, రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని, సమాచార సాంకేతిక విప్లవానికి పునాది వేసిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు.