PPM: సీతానగరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం జరిగిన ముడుపుల పూజ కోసం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ముడుపుల పూజలకు దూర ప్రాంతాలు నుంచి ఎక్కువ మంది వస్తున్నట్లు ఆలయ అర్చకుడు పీసపాటి శ్రీనివాసాచార్య తెలిపారు. ఈ ఆలయంలో స్వామివారిని విశ్వాసంతో, భక్తితో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం.