KMM: మధిర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దేందుకు నూతన కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దాతలు సైతం విరాళాలు అందిస్తున్నారు. భక్తుల సహకారంతో దేవాలయం మరింత వైభవాన్ని సంతరించుకుంటుందని కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.