BDK: మణుగూరు (M) అశోక్ నగర్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న లబ్ధిదారురాలు సాని కొమ్ము శ్రేయ గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు.