TG: తాము పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు పాదయాత్ర చేస్తామని ప్రకటించగానే.. కాంగ్రెస్ నేతలు సమీక్ష అంటూ నాటకమాడారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఇరిగేషన్ అధికారులు లేకుండా సమీక్ష చేస్తే లాభమేంటని నిలదీశారు. తాము చేసిన పనులను ప్రజలకు చూపిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు నిరాశ చెందారని వ్యాఖ్యానించారు.