TG: BRS హయాంలో కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించలేదని సీఎం రేవంత్ అన్నారు. కార్మికుల సంక్షేమం, కనీస వేతనాలపై KCR నిర్లక్ష్యం వహించారని వాపోయారు. కనీస వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారని తెలిపారు. కార్మికుల కనీస వేతనాలపై మంత్రి వర్గ ఉపసంఘం నియమించామని వెల్లడించారు. కార్మికులను 4 విభాగాలుగా చేసి కనీస వేతనాలు నిర్ణయించామని ప్రకటించారు.