GNTR: కంచర్లపాలెంలో జరిగిన ఘటనపై వాస్తవాలు తెలియకుండానే హత్యగా ప్రచారం చేస్తున్న కొన్ని సోషల్ మీడియా ఛానళ్లపై చర్యలు తీసుకుంటామని తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్ హెచ్చరించారు. ప్రస్తుతం ఘటనపై విచారణ కొనసాగుతోందని, పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించి నిజాలను వెల్లడిస్తామని తెలిపారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని సూచించారు.