SRD: సిర్గాపూర్ మండలం వాసరు గ్రామంలో మన ఊరి ప్రభుత్వ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ హనుమంతరావు పార్టీ ఉపసర్పంచ్ విట్టల్ రెడ్డి ఉపాధ్యాయుడు రహీం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు గ్రామంలో ర్యాలీ నిర్వహించి సర్కార బడిలో పిల్లలను చేర్పించాలని అవగాహన కల్పించారు.