ADB: బోథ్ మండలంలోని నిగిని, కంటేగాం గ్రామాలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. డాక్టర్ సౌజన్య రోగులను పరీక్షించి ఉచిత మందులను అందజేశారు. వడదెబ్బక తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఆరోగ్యశాఖ సిబ్బంది ఉన్నారు.