ATP: గుంతకల్లు మండలం కొట్టాల గ్రామంలో ఉపాధి హామీ పనులను గురువారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ దేవేంద్ర, సీపీఐ మండల కార్యదర్శి రాము రాయల్, మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టం ప్రకారం పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు.