NRML: మన ఊరు, మన పంట చేలు కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా కాల్వ గ్రామంలో గురువారం ఫీడర్ కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో గోవర్ధన్, ఏపీఓ దివ్య రెడ్డి, ఉప సర్పంచ్,సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, సాగునీటి సౌకర్యాల మెరుగుదల కోసం చేపట్టిన ఈ పనులు రైతులకు ఉపయోగంగా ఉంటాయని అధికారులు తెలిపారు.