TG: కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాలకు భక్తులు భారీగా తరలొస్తున్నారు. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కలిసే త్రివేణి సంగమ క్షేత్రమే కాళేశ్వరం. ప్రయాగ్రాజ్ తర్వాత ఇలాంటి త్రివేణి సంగమం ఉన్న రెండో ప్రదేశం ఇదే. ఇక్కడ స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోయి, పునర్జన్మ నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం