ASF: బెజ్జూరు మండలం పోతపల్లి గ్రామానికి చెందిన డోకే మౌనికకు మంజూరైన రూ.60,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గురువారం బీజేపీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. MLA హరీష్ బాబు ఆదేశాల మేరకు దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి చెక్కులు అందజేశామని తెలిపారు. సర్పంచ్ కుమ్మరి రామకృష్ణ, ఉప సర్పంచ్ ఆత్రం దేవాజీ,తదితరులు పాల్గొన్నారు.