థాయ్లాండ్ వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. విదేశీ పర్యాటకుల కోసం అమల్లో ఉన్న వీసారహిత ప్రవేశ నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పటివరకు ఉన్న 60 రోజుల వీసారహిత ప్రవేశాన్ని అకస్మాత్తుగా రద్దు చేసింది. దీంతో జూన్, జూలై నెలల్లో థాయ్లాండ్ ప్లాన్ చేసుకున్న ఫ్యామిలీలపై ఆ దేశ ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.