MDK: రామాయంపేట మున్సిపల్ పరిధిలోని మెదక్ చౌరస్తాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి, యాదగిరి, నవనీత గణేష్, కౌన్సిలర్లు సందీప్, రంజిత్, శ్యామల, స్వప్న, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.