MLG: తెలంగాణ సమీకృత కమాండ్ అండ్ నియంత్రణ కేంద్రం గురువారం మీప్రాంతంలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 4గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని, అవసరమైతే తలను కప్పుకుని నీరు,మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీరు తీసుకోవాలని సూచించింది. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలని హెచ్చరించింది.