BHNR: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ బస్టాప్ వద్ద గురువారం ఆయన విగ్రహానికి ఆలయ చైర్మన్ దేప శ్యాంసుందర్, ఏఎంసీ డైరెక్టర్ గౌస్ ఖాన్ పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామ శాఖ అధ్యక్షులు సుక్క రవీందర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.