SKLM: ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి పాల్గొని, ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విన్న మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.