VZM: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరగకుండా చూడాలని బొబ్బిలి MPDO పి.రవికుమార్ హెచ్చరించారు. గురువారం స్దానిక కింతలివాని పేటలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పనుల్లో అక్రమాలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మస్తర్లు సక్రమంగా వేయాలన్నారు. పని చేసే ప్రాంతంలో నీడ, మంచినీటిని ఏర్పాటు చేయాలని సూచించారు.