TG: మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లులో మోదీ సర్కార్ కుయుక్తులు పన్నిందని సీఎం రేవంత్ విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్తో లింక్ పెట్టారని మండిపడ్డారు. ఈ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ పార్లమెంటులో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు.