AP: బక్రీద్ పండుగ సందర్భంగా ఈనెల 28న సెలవు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇంతకు ముందు జారీచేసిన క్యాలెండర్ ప్రకారం బక్రీద్ సెలవును ఈనెల 27గా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వక్ఫ్‌బోర్డు సీఈవో అభ్యర్థన మేరకు సెలవును 27కు బదులు 28గా ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఈ మేరకు జీవో 1006ను విడుదల చేసింది.