TG: రాష్ట్రంలో మే 25 నుంచి 31 వరకు ప్రభుత్వం మహిళా వారోత్సవాలను నిర్వహించనుంది. ఈనెల 29న ఇంక్యుబేటర్ ప్రోగ్రాంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు విడుదల చేయనున్నారు. అంతేకాకుండా మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలను సర్కార్ రూపొందించనుంది. బాలికలకు సైకిళ్లు, ఆరోగ్య శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరలను అందించనుంది.