TG: నకిలీ పీఏ సంతోష్‌గుప్తా కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం రేవంత్ పీఏనంటూ హోటళ్లలో సెటిల్మెంట్లు, భూవివాదాల్లో తలదూర్చడం, విద్యాసంస్థల నుంచి వసూళ్లు, RTI చట్టంతో రియల్టర్లను బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 5 విల్లాలు లేదా రూ.25 కోట్లు ఇవ్వాలని ఓ రియల్టర్‌ను బెదిరించాడు. రియల్టర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.