SRD: హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్నా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దౌల్తాబాద్ బస్టాండ్లో మహిళా ఫోన్ చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకుని 7ఫోన్లు, 1 ఆటో స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.85000 ఉంటుందన్నారు. నిందితుల్ని జిన్నారం కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు SI శ్రీధర్ తెలిపారు.