VZM: గత నెలరోజులుగా దాహం కేకలు వేస్తున్నా అదికారులు పట్టించుకోవటం లేదని గజపతినగరం మండలం పురిటిపెంట SC కాలనీ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గురువారం BJP మండల అధ్యక్షుడు మేటికోటి భాస్కరరావు ఆ కాలనీని సందర్శించి మహిళల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. సమస్యను అధికారులకు తెలియజేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.