MDCL: బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ అందుబాటులో ఉంచినట్లు వైద్య అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి ఏరియా ఆసుపత్రులతో పాటు మేడ్చల్, ఘట్కేసర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 14 ఏళ్లు పైబడిన బాలికలకు టీకాలు వేస్తున్నారు. ఆసుపత్రి పని దినాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.