KKRతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన MIకు మరో బిగ్ షాక్ తగిలింది. ముంబై బౌలింగ్ చేస్తున్న సమయంలో ప్రవర్తనా నియమావళిని కెప్టెన్ హార్దిక్ ఉల్లంఘించాడు. 10వ ఓవర్లో బౌలింగ్ రన్-అప్‌కు వెళ్తూ కోపంతో వికెట్ బెయిల్స్‌ను పాండ్యా పడగొట్టాడు. దీంతో మ్యాచ్ ఫీజులో 10శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను BCCI విధించింది.