నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో క్రేజీ ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే. ‘NBK 112’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా జూన్ 10న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే దీని రెగ్యులర్ షూటింగ్ దసరాకు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించనున్నట్లు సమాచారం.