కడప: నగర శివార్లలోని రాజంపేట రోడ్డు వెంబడి జరుగుతున్న వర్షపు నీటి పారుదల పనులను కేఎంసీ అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిని సమీక్షించిన ఆయన సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలానికి ముందే పనులను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.