VZM: సంతకవిటి మండలం మండవకురిటి గ్రామంలో తాగునీటి సరఫరా పైపులు మురుగు కాలువలో ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చిన్న రంధ్రాలు పడినా మురుగునీరు కలిసే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. వేసవి కాలంలో తాగునీటికి ప్రత్యామ్నాయం లేక అదే నీటిని ఉపయోగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.