ASF: కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల సర్పంచ్ కొండగొర్ల ప్రకాశ్ కాంగ్రెస్లో చేరారు. MLC దండే విఠల్ సమక్షంలో ఆయనకు పార్టీ కండువా కప్పారు. కాంగ్రెస్ ప్రజాపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనై పార్టీలో చేరినట్లు సర్పంచ్ తెలిపారు. MLC ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఆయనతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్లో చేరారు.