NZB: జిల్లాలో 225కి పైగా ఇటుక బట్టీలు కొనసాగుతున్నాయని అంచనా. వీటిల్లో ఏ ఒక్కటీ జిల్లా గనుల శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం గమనార్హం. ఒక్కోచోట ఇటుకలు కాల్చే బట్టీలు పది నుంచి ఇరవై వరకు ఉంటున్నాయి. నిబంధనల ప్రకారం ఒక బట్టీకి రూ.20 వేల చొప్పున చెల్లించి గనుల శాఖ వద్ద నమోదు చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా నమోదు కాకపోవడం గమనార్హం.