ఎన్టీఆర్: మైలవరం నియోజకవర్గంలో జనసేన నేత అక్కల రామమోహన్ రావు (గాంధీ) వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి వైసీపీ కుట్రలు చేస్తోందని, పవన్ కళ్యాణ్‌పై విశ్లేషకుల ద్వారా అసత్య ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు.