SRD: జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.