NGKL: లింగాల మండలం సురాపూర్ గ్రామంలో గురువారం ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా పరిశీలించారు. కూలీలతో మాట్లాడి వేతనాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరాతీశారు. ఎండ తీవ్రత దృష్ట్యా పని ప్రదేశాల్లో నీడ కోసం టెంట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స పెట్టెలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.